: మోదీ కొత్త నినాదం 'భారత్ పర్వ'
దేశాన్ని పరిశుభ్రంగా ఉండాలని మోదీ ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' ఉద్యమం జోరుగా సాగుతుంటే, మోదీ ఇంకో అడుగు వేసేశారు. ఇండియాలో టూరిజాన్ని మరింతగా పెంచడంతో బాటు, మనకు మాత్రమే ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలను విదేశాలకు తెలిపేందుకు 'భారత్ పర్వ' పేరిట నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇండియాలోని చిన్న, పెద్ద పట్టణాలు, మెట్రోలతో పాటు ఎంపిక చేసిన విదేశీ నగరాల్లో 'ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా' పేరిట కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 'భారత్ పర్వ' ఆర్థికంగా లబ్ధిని చేకూర్చే ప్రాజెక్టుగా కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి మహేష్ శర్మ అభివర్ణించారు. భారత సంస్కృతికి మరింత ప్రచారం కల్పించి దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే ఈ నినాదం ముఖ్య లక్ష్యమని ఆయన అన్నారు.