: టీవీ నటి దీప్తి కుమార్తె అదృశ్యం
కొంతకాలం క్రితం హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో మరణించిన టీవీ నటి దీప్తి కుమార్తె జ్యోతి అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పార్వతీపురంలోని ఆర్ సీఎం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జ్యోతి ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం సమయంలో కిరాణా దుకాణానికి వెళ్తున్నానని నానమ్మకు చెప్పి వెళ్లింది. కానీ, తిరిగి ఇంటికి రాలేదు. ఆమె తండ్రి ఈశ్వరరావు రాత్రి విధుల నుంచి వచ్చి కుమార్తె గురించి ఆరా తీశాడు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, జ్యోతి తల్లి దీప్తి అలియాస్ రామలక్ష్మి నటిగా రాణించాలన్న ఉద్దేశంతో భర్తను, కుమార్తెను వదిలి వచ్చి, బాలానగర్ పరిధిలోని ఫతేనగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంటులో ఫిబ్రవరి 14న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె 'ఆడదే ఆధారం', 'ఆహ్వానం' తదితర సీరియల్స్ లో నటించింది.