: బంజారాహిల్స్ లో కారు బీభత్సం...మద్యం మత్తులో యువకులను ఢీకొట్టిన వ్యాపారి


మద్యం మత్తు తలకెక్కిన హైదరాబాదీ వ్యాపారి కారుతో నిన్న రాత్రి బీభత్సం సృష్టించాడు. ఫుల్లుగా మద్యం సేవించిన వ్యాపారి వాహిద్ బంజారాహిల్స్ రోడ్లపై కారుతో దూసుకెళ్లాడు. మత్తు తలకెక్కిన అతడి చేతిలో కారు అదుపు తప్పింది. రోడ్డుపై వెళుతున్న ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వాహిద్ ర్యాష్ డ్రైవింగ్ ను గమనించిన స్థానికులు ఎలాగోలా కారును నిలువరించి వాహిద్ ను పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ ఇద్దరు యువకులను కేర్ ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News