: సినీ జనాలను అచ్చెరువొందించిన ఆరాధ్య బచ్చన్


బాలీవుడ్ స్టార్లు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ దంపతుల గారాలపట్టి ఆరాధ్య ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను వ్యక్తిత్వ పరంగా ఎవరూ వేలెత్తి చూపలేరు. ముఖ్యంగా, సభ్యత, సంస్కారాలను దృష్టిలో పెట్టుకుంటే ఆయన హిమాలయ శిఖరం వంటివారు. చిన్నవారిని కూడా "మీరు" అని సంబోధించే ఔన్నత్యం ఆయన సొంతం. ఆయన కొడుకుగా అభిషేక్ కూడా ఎన్నదగిన వ్యక్తే. పెద్ద వాళ్ల ఎడల భక్తిశ్రద్ధలు ప్రదర్శిస్తాడు. ఇప్పుడు అభిషేక్ కుమార్తె ఆరాధ్య తాను చిన్నదైనా, పెద్దలయందు గౌరవం విషయంలో పెద్దదాన్నే అని చాటుతోంది. ఐశ్వర్య కేన్స్ చిత్రోత్సవానికి వెళ్లే సమయంలో చోటు చేసుకున్న ఓ ఘటనే అందుకు నిదర్శనం. విమానం ఎక్కే ముందు ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్య తన మామగారు అమితాబ్ బచ్చన్ కాళ్లకు నమస్కరించింది. అది చూసి ఆరాధ్య కూడా తాత కాళ్లకు మొక్కి గౌరవం ప్రదర్శించింది. దీంతో, అక్కడున్న వారందరూ ఆ చిన్నారి ప్రదర్శించిన వినయవిధేయతలకు ముగ్ధులయ్యారు. బచ్చన్ ల పెంపకం అలాంటిదని, అమితాబ్, అభిషేక్ పెద్దలను విశేషంగా గౌరవిస్తారని, వారి అలవాట్లే చిన్నారి ఆరాధ్యకు వచ్చాయని అనుకున్నారట. ఇక, కాళ్లకు నమస్కరించిన మనవరాలిని నిండు మనసుతో ఆశీర్వదించారు బిగ్ బి.

  • Loading...

More Telugu News