: తిరుమలలో జయలలిత అభిమానుల హల్ చల్
తిరుమలలో విజిలెన్స్ అధికారుల నిఘా లోపాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఈ ఉదయం తమిళనాడు నుంచి వచ్చిన పలువురు జయలలిత అభిమానులు ఆమె చిత్రపటాలను ప్రదర్శిస్తూ, ఆలయం ముందు పెద్దఎత్తున నినాదాలు చేశారు. వీరిని అడ్డుకునేందుకు ఏ అధికారి, భద్రతా సిబ్బంది ముందుకు రాలేదని సమాచారం. ఇటీవల జయలలితపై ఉన్న అక్రమాస్తుల కేసులో తీర్పును సస్పెండ్ చేస్తూ, కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సుమారు 100 మందికి పైగా జయలలిత అభిమానులు తిరుమలకు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అంతవరకూ బాగానే ఉందికానీ, ఆమె ఫోటోలు చూపుతూ హల్ చల్ చేయడాన్ని భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు.