: సింగపూర్ నుంచి వచ్చింది హిజ్రాలతో కొట్టించుకోవడానికా?... వాపోతున్న కావలి యువకుడు


అతడి పేరు కిరణ్. ఊరు నెల్లూరు జిల్లా కావలి. సింగపూరులో సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌ గా పనిచేస్తున్నాడు. సొంతూరికి బయలుదేరి చెన్నై ఎయిర్‌ పోర్టులో దిగాడు. కావలి వెళ్లేందుకు అసన్ సోల్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. సూళ్లూరుపేట దాటిన తరువాత రైలెక్కిన కొందరు హిజ్రాలు కిరణ్‌ ను డబ్బులు డిమాండ్ చేశారు. పోనీలే అని కొంత చిల్లర ఇవ్వడంతో ఆగ్రహంతో ఊగిపోతూ, కిరణ్ పై దాడి చేసి అతడి పర్సును లాక్కొని అందులోని రూ. 4 వేలను అపహరించారు. అదే రైలులో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన మరో ముగ్గురు యువకులపైనా హిజ్రాలు దాడి చేసినట్లు సమాచారం. జరిగిన ఘటనపై కిరణ్ కావలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సింగపూర్ నుంచి వచ్చింది హిజ్రాలతో కొట్టించుకోవడానికా? అని ఇప్పుడు కిరణ్ వాపోతున్నాడు. చెన్నై, ఒంగోలు మధ్య ప్రతి రైలులోనూ హిజ్రాల అల్లర్లు పెరుగుతుండడంతో ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News