: లియోనియా రిసార్ట్స్ పై దాడి: అర్ధనగ్నంగా ఉన్న 23 మంది అరెస్ట్


రంగారెడ్డి జిల్లా శామీర్ పేటలోని ఓ లియోనియా రిసార్ట్స్ లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ రిసార్ట్స్ లో రేవ్ పార్టీ జరుగుతోందని తెలుసుకున్న ఎస్ వోటీ పోలీసులు గత అర్ధరాత్రి దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న 23 మంది విదేశీ యువతి, యువకులను పోలీసులు అరెస్ట్ చేసి వారిని స్టేషన్ కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పట్టుబడిన వారంతా సొమాలియా, మంగోలియాకు చెందిన వారని, అరెస్ట్ అయిన వారిలో 8 మంది మహిళలు ఉన్నారని పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News