: మంగోలియన్ల మనసులూ దోచేసుకున్న మోదీ
మంగోలియా ప్రజా ప్రతినిధుల మనసులనూ ప్రధాని మోదీ దోచుకున్నారు. ఓ విదేశీ నేతకు తమ దేశ పార్లమెంటులో ప్రసంగించే తొలి అవకాశాన్ని మంగోలియా ప్రభుత్వం మోదీకి ఇస్తే, తన వాక్చాతుర్యంతో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. ఏ భారత ప్రధానీ మంగోలియాకు రాకున్నా గత 60 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయని అన్న ఆయన, 2 వేల ఏళ్ల క్రితమే ఇండియా నుంచి బయలుదేరి ఎన్నో కష్టాలు పడి, పర్వతాలు దాటి ఇక్కడికి వచ్చిన బౌద్ధ గురువులు మత ప్రచారం సాగించారని గుర్తు చేశారు. ఆసియా, ఐరోపా ఖండాల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి మంగోలియానే కారణమని పొగిడారు. మంగోలియా అభివృద్ధికి భారత్ పెద్దన్నలా సహకరిస్తుందని అన్నారు. మోదీ ప్రసంగిస్తుండగా, పలు మార్లు మంగోలియా పార్లమెంటు సభ్యులు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. అంతకుముందు ఆయన స్థానిక బౌద్ధారామంలో బోధి మొక్కను నాటారు.