: మద్యం దుకాణంపై తాగుబోతు ప్రతాపం... రూ. 2 లక్షల సరుకు నాశనం


ఓ వ్యక్తి తప్పతాగి మద్యం దుకాణాన్నే సర్వ నాశనం చేసేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది. ఓ తాగుబోతు ఇక్కడి మద్యం దుకాణంలోకి ప్రవేశించి సుమారు రూ. 2 లక్షల విలువైన మద్యం సీసాలను ధ్వంసం చేయడంతో పాటు అక్కడి ఫర్నీచరును సైతం పగలగొట్టాడు. అక్కడున్న వారిని, మద్యం షాపు సిబ్బందినీ హడలగొట్టాడు. షాపులోని సరుకంతా ధ్వంసమైన తరువాత అతి కష్టం మీద అతడిని అదుపు చేసిన ప్రజలు పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఏ విషయమై తగవు వచ్చి దుకాణంపై దాడి చేశాడన్న విషయంపై సమాచారం తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News