: బంగ్లాదేశ్ లో వెలుగుచూసిన వెయ్యేండ్ల నాటి హిందూ దేవాలయం


బంగ్లాదేశ్ లో సుమారు వెయ్యేండ్ల నాటి పురాతన హిందూ దేవాలయం బయటపడింది. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతున్న బంగ్లాదేశ్ వాయవ్య ప్రాంతంలో ఈ దేవాలయం వెలుగులోకి వచ్చినట్టు అధికారులు వివరించారు. దీనిని 8-9 శతాబ్దాల కాలంలో పాలరాజ వంశీయులు నిర్మించినట్టు తెలుస్తోంది. దినాజ్‌ పూర్‌ లోని బొచ్చగంజ్ ప్రాంతంలో ఈ దేవాలయాన్ని కనుగొన్నామని జహంగీర్‌ నగర్ యూవర్సిటీ ప్రొఫెసర్, పురావస్తు శాస్త్రవేత్త స్వాధీన్‌ సేన్ వివరించారు. ఈ దేవాలయం గురించిన మరిన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News