: జర్మన్ ఫుట్ బాలర్ ను రహస్యంగా వివాహం చేసుకున్న మాజీ టెన్నిస్ స్టార్!


గతంలో టెన్నిస్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగి కొంతకాలం పాటు నెంబర్ వన్ ర్యాంకును అనుభవించిన సెర్బియా అందాల రాణి అనా ఇవనోవిచ్‌, జర్మన్‌ ఫుట్‌ బాలర్‌ బాస్టియన్‌ షవెన్‌ స్టీగర్‌ లు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ ఇటలీ వెబ్‌ సైట్‌ తెలుపుతూ, ఇద్దరూ వజ్రాల ఉంగరాలను మార్చుకున్నట్లు పేర్కొంది. 27 ఏళ్ల ఇవనోవిచ్‌, 30 ఏళ్ల బాస్టియన్‌ లు గత కొన్ని రోజులుగా డేటింగ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ పెళ్లి వార్తను అనా, బాస్టియన్ ల జోడీ ఖండించలేదు. అలాగని తాము వివాహం చేసుకున్నట్టు స్పష్టం చేయనూ లేదు. ఇద్దరి ట్విట్టర్‌ ఖాతాలోనూ ఈ విషయంపై సమాచారం లేదు.

  • Loading...

More Telugu News