: ‘అస్లాంఖాన్’ గా సుదీప్... ‘బాహుబలి’ తాజా పోస్టర్ విడుదల


తెలుగు సినీ చరిత్రలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సంచలనాత్మక చిత్రం ‘బాహుబలి’ తాజా పోస్టర్ విడుదలైంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియాలో పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ‘అస్లాంఖాన్’ పాత్రలో కన్నడ నటుడు సుదీప్ భారీ ఆకారంతో ఆకట్టుకుంటున్నాడు. రాజమౌళి నిర్మించిన హిట్ చిత్రం ‘ఈగ’లో విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుదీప్, జక్కన్న తాజా చిత్రం ‘బాహుబలి’లో ‘అస్లాంఖాన్’గా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నాడు. ‘‘నా రిక్వెస్ట్ మేరకు కిచ్చా సుదీప్ ‘బాహుబలి... ద బిగినింగ్’లో ఓ చిన్న అతిథి పాత్రకు ఒప్పుకున్నాడు. ఆయనకు నా ధన్యవాదాలు’’ అంటూ రాజమౌళి ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News