: ఢిల్లీలో కాల్పుల కలకలం... మెట్రో స్టేషన్ వద్ద ఆగంతుకుడి కాల్పుల్లో ఇద్దరికి గాయాలు
దేశంలో గన్ కల్చర్ నానాటికీ పెరిగిపోతోంది. నేరాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన నగరాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీని కూడా గన్ కల్చర్ ఆందోళనకు గురి చేస్తోంది. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో చోటుచేసుకున్న కాల్పులు కలకలం రేపాయి. నగరంలోని ఇంద్రలోక్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఉన్నట్లుండి జేబులోని తుపాకి తీసి విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెనువెంటనే స్పందించిన ఢిల్లీ పోలుసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.