: స్మిత్ ఔట్, హస్సీ ఇన్... బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లీగ్ దశ పోటీలు ముగింపు దశకు చేరగా, తమ చివరి లీగ్ మ్యాచ్ లో సత్తా చాటాలని అటు ఆఖరు ప్లేస్ లో నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ జట్లు భావిస్తున్నాయి. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, చెన్నై జట్టు స్వల్ప మార్పులతో బరిలోకి దిగింది. ఓపెనర్ డ్వేన్ స్మిత్ ను పక్కనబెట్టిన కెప్టెన్ ధోనీ, అతడి స్థానంలో మైఖేల్ హస్సీని తుది జట్టులోకి తీసుకున్నాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టు స్కోరు 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 41 పరుగులు.