: చిరుకు జనంలో క్రేజ్ తగ్గలేదు... రేణిగుంటలో ఎగబడ్డ జనంపై మెగాస్టార్ ఫైర్


కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి... దాదాపుగా ఎనిమిదేళ్లుగా సినీ వినీలాకాశానికి దూరంగా ఉన్నారు. సొంతంగా పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాలను మార్చేద్దామంటూ ఆయన కార్యరంగంలోకి దూకారు. తిరపతి వేదికగా 'ప్రజారాజ్యం' పేరిట పార్టీ పెట్టిన ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో పర్యాటక శాఖ మంత్రి అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఓటమిపాలు కావడంతో రాజకీయంగా విఫల నేతగా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. అయినా చిరుకు జనంలో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. చిరును చూసేందుకు జనం ఎగబడుతూనే ఉన్నారు. తాజాగా నేడు చిత్తూరు జిల్లా రేణిగుంటలో చిరును చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. ఆయనను చూసేందుకు, కరచాలనం చేసేందుకు చొచ్చుకొచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఓ అభిమాని ఏకంగా చిరుపై పడబోయారు. ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన చిరు అభిమానులపై ఫైరయ్యారు. ఒకానొక సందర్భంతో తనపై పడబోయిన అభిమానిని చిరు నెట్టేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అభిమానుల తోపులాట మధ్యే చిరు కారెక్కి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News