: రాహుల్ పాదయాత్ర సక్సెస్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందన
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి వఢ్యాల్ వరకు చేపట్టిన కిసాన్ సందేశ్ పాదయాత్ర విజయవంతమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాహుల్ పాదయాత్ర విజయవంతమయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా కళ్లు తెరిచి రైతు సమస్యలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. అధికారంలో ఉన్నది ప్రజాసమస్యలు పరిష్కరించేందుకన్న విషయం అంతా గుర్తిస్తే బాగుంటుందని ఆయన సూచించారు.