: షాంగైలో మోదీ భోజన మెనూ ఇదే!


చైనా పర్యటనలో బిజీగా తిరుగుతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం అక్కడి అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం షాంగైలో ఉన్న ఆయన కోసం షాంగై పార్టీ కార్యదర్శి హాన్ జెంగ్ పూర్తి శాకాహార విందును ఏర్పాటు చేశారు. మోదీ ఇష్టపడే ఆహార ఉత్పత్తులు, అలవాట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెబుతున్నారు. మోదీ కోసం ఏర్పాటు చేసిన మెనూలో అటు చైనా సంప్రదాయ వంటక రీతులను వీడకుండా శాకాహార వంటకాలు సిద్ధం చెయ్యడం విశేషం. ఈ మెనూలో డబుల్ బాయిల్డ్ బీన్ కర్డ్ సూప్, స్టీవ్డ్ పోర్సిని, పాన్ కేక్ విత్ వెజిటబుల్స్, చిల్డ్ మాంగో సాగో క్రీమ్, వెజిటబుల్ కర్రీ సాస్ విత్ రైస్ తదితరాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News