: వారిని ఒక్క వీధికే పరిమితం చెయ్యండి: మొత్తుకుంటున్న కామాటిపుర వాసులు


కామాటిపుర... ముంబయ్ లోని ఈ ప్రాంతం ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాగా గుర్తింపు పొందింది. ఇక్కడ సెక్స్ వర్కర్లు ఎన్నో దశాబ్దాలుగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. గత కొంతకాలంగా వీరు విస్తరణ బాట పట్టడంతో స్థానికంగా నివసిస్తున్న సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. సెక్స్ వర్కర్లను వేరే ప్రాంతానికి తరలించాలని రెండు వేల మందికి పైగా ప్రజలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు వినతిపత్రాలు సమర్పించారు. అలా కుదరకుంటే, కనీసం సెక్స్ వర్కర్ల కుటుంబాలను 11వ వీధికి పరిమితం చెయ్యాలని వారు కోరారు. వీరి వల్ల తమ పిల్లలకు పాఠశాలల్లో అడ్మిషన్లు లభించడం లేదని, పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని, బంధువులు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారని వాపోయారు.

  • Loading...

More Telugu News