: వైఎస్సార్సీపీ, టీడీపీ ఆందోళన... విజయవాడ మేయర్ పై ప్రభుత్వం సీరియస్


విజయవాడ కనకదుర్గ లేఅవుట్ వివాదం ముదిరింది. 21 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వివాదాస్పద లే అవుట్ లో నిర్మాణాలకు విజయవాడ కార్పొరేషన్ మేయర్ రాత్రికి రాత్రి అనుమతులు ఇవ్వడంపై టీడీపీ, వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగాయి. వైఎస్సార్సీపీకి చెందిన 19 మంది కార్పొరేటర్లు మేయర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ముడుపులు తీసుకుని మేయర్ కనకదుర్గ లేఅవుట్ లో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కౌన్సిల్ ముందుకు తీసుకురాకుండా కనకదుర్గ లే అవుట్ కు అనుమతులు ఎలా మంజూరు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో స్పందించిన టీడీపీ అధిష్ఠానం మేయర్ పై మండిపడింది. వెంటనే అనుమతులు రద్దు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News