: రాహుల్ దేశ రాజకీయాలను దిగజర్చాడు: కిషన్ రెడ్డి


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లా వడ్యాల్ సభలో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తప్పుబట్టారు. మోదీ సూట్ గురించి వ్యాఖ్యానించడం ద్వారా రాహుల్ దేశ రాజకీయాలను దిగజార్చాడని అన్నారు. రాహుల్ పరిణతి చెందని వ్యక్తిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓ బీసీ వ్యక్తి ప్రధాని కావడం రాహుల్ కు మింగుడు పడడంలేదని అన్నారు. తెలంగాణలో పాదయాత్ర సందర్భంగా, రాహుల్ రైతులకు ఎలాంటి విశ్వాసం కలిగించలేకపోయారని కిషన్ రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News