: అప్పటివరకు ఇంటికి రామని భర్తలకు తెగేసి చెప్పండి: ఆడపడుచులకు చంద్రబాబు సలహా


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ... మరుగుదొడ్ల ప్రాధాన్యతను వివరించారు. సెల్ ఫోన్ కన్నా టాయిలెట్ ముఖ్యమని అన్నారు. సెల్ ఫోన్ కు ఇస్తున్న ప్రాధాన్యత సామాజిక గౌరవానికి ఇవ్వడం లేదన్న ఆవేదన ఆయన మాటల్లో వ్యక్తమైంది. ఇక, అత్తవారింట్లో మరుగుదొడ్డి లేకపోతే, వెంటనే పుట్టింటికి వెళ్లిపోండంటూ ఆడపడుచులకు సలహా ఇచ్చారు. టాయిలెట్ కడితేనే ఇంటికి వస్తామని మీ భర్తలకు తెగేసి చెప్పండని ఉద్బోధించారు. ఇక, నిధులను సక్రమంగా వినియోగించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు.

  • Loading...

More Telugu News