: సమ్మె వల్ల నష్టపోయిన ప్రయాణికుల కోసం ఆర్టీసీ చర్యలు


ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కారణంగా నష్టపోయిన ప్రయాణికుల కోసం ఆ సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి నగదు చెల్లించాలని నిర్ణయించారు. సమ్మె సమయంలో తీసుకున్న టికెట్లకు నగదు తీసుకోవచ్చని లేదా, మరో తేదీన ప్రయాణం చేసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు వారంలోగా టికెట్లు రద్దు చేసుకోవాలని ఆర్టీసీ తెలిపింది. అలాగే ఈ సమ్మె కాలంలో పాస్ తీసుకుని నష్టపోయిన ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని, పాస్ కాలపరిమితి పెంచుతున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News