: వాళ్లు హీరోయిన్లను కూడా చెడగొడుతున్నారు: చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ, ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాపై ధ్వజమెత్తారు. స్మగ్లర్లు తాము చెడిపోవడమే కాకుండా, సినిమా హీరోయిన్లను కూడా చెడగొడుతున్నారని మండిపడ్డారు. 'ఎర్ర' స్మగ్లర్ మస్తాన్ వలీతో అనుబంధం కారణంగా నటి నీతూ అగర్వాల్ కు కూడా 'ఎర్ర' మకిలి అంటిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు పైవ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతోంది. ఇక, స్మగర్ల పాలైన ఎర్రచందనంలో ఒక శాతం స్వాధీనం చేసుకుంటేనే వేల కోట్ల రూపాయలు వచ్చాయని, వారి చేతుల్లో ఉన్న మొత్తం ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుంటే మరెన్నో వేల కోట్లు వస్తాయని చంద్రబాబు అన్నారు.