: రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, శివాజీ రాజాలకు కోర్టు నోటీసులు


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వివాదం ఇంకా ముగిసిపోలేదు. 'మా' ఎన్నికలపై నటుడు ఓ.కల్యాణ్ తాజాగా సిటీ సివిల్ కోర్టులో మళ్లీ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో, అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్, శివాజీ రాజాలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికలకు ముందు రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్, జయసుధ ప్యానెల్ మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎన్నికలు నిలిపేయాలంటూ ఓ.కల్యాణ్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దానిని కొట్టి వేయడంతో, మార్చి 29న ఎన్నికలు జరగడం, ఏప్రిల్ 17న న్యాయస్థానం ఆదేశాలతో ఓట్ల లెక్కింపు జరగడం, అందులో 85 ఓట్ల మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించడం, 19న మా అధ్యక్షుడిగా ఆయన ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News