: కష్టకాలంలో దేవుడిలా వచ్చారు... రాహుల్ సాయంపై ఓ రైతు కుటుంబం


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో చేపడుతున్న రైతు భరోసా యాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు రాహుల్ పాదయాత్రలో పాలుపంచుకుంటున్నారు. యాత్రలో భాగంగా రాహుల్ కొద్దిసేపటి క్రితం రాచపూర్ లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గంగాధరం కుటుంబాన్ని పరామర్శించారు. గంగాధర్ ఆత్మహత్యతో ఇంటి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. అప్పుల బాధ తాళలేక గంగాధరం బలవన్మరణం చెందితే, ఆయన కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. గంగాధరం ఇంటిలోకి వెళ్లిన రాహుల్ బాధిత కుటుంబం అప్పుల గురించి ఆరా తీశారు. ఆగిపోయిన ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి వివరాలడిగారు. ఆ తర్వాత గంగాధరం కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల సహాయం అందజేసి, అండగా ఉంటానని భరోసా ఇచ్చి అక్కడి నుంచి కదిలారు. అనంతరం గంగాధరం కుటుంబ సభ్యులు రాహుల్ ను దేవుడితో పోల్చారు. కష్టకాలంలో రాహుల్ తమ పాలిట దేవుడిలా వచ్చారంటూ కీర్తించారు.

  • Loading...

More Telugu News