: మీడియాపై జైట్లీ ధ్వజం... వాస్తవాలను మరుగునపరుస్తున్నాయంటూ ఆరోపణ


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీడియాపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన మీడియా... ఎజెండాను నిర్దేశించే స్థాయికి చేరుకుందని ఆరోపించారు. వాస్తవాలను ప్రపంచానికి తెలపాల్సిన మీడియా సంస్థలు... అనేకసార్లు వాస్తవాలను మరుగున పడేస్తున్నాయని అన్నారు. తమ రేటింగ్ ను పెంచుకునేందుకు వివాదాస్పద అంశాలు, నేరపూరిత కథనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. మీడియా తన పద్ధతి మార్చుకోవాలని... సమాజానికి మేలు చేసేలా కథనాలను అందించాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News