: ఢిల్లీకి అంటిన ‘ఎర్ర’ మకిలీ... 5 టన్నుల ఎర్రచందనం దుంగలు పట్టివేత
ఏపీలో కలకలం రేపుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా దేశ రాజధాని ఢిల్లీకీ చేరింది. నిన్న ఢిల్లీలో ఆటోలో తరలిపోతున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆటోలో ఎర్రచందనాన్ని తరలిస్తున్న మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ఫరూఖ్ లను అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు నగరంలోని స్వరూప్ నగర్, సుల్తాన్ పురిల్లోని గోదాములపై పోలీసులు దాడులు చేశారు. ఈ సోదాల్లో 5 టన్నుల ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఏకంగా దేశ రాజధానిలోనే ఎర్రచందనం దుంగలు పట్టుబడటంతో అక్కడి పోలీసులు షాక్ కు గురయ్యారు.