: పదవి ఊడినా... బుగ్గ కార్లలోనే తెలంగాణ పార్లమెంటరీ కార్యదర్శులు
తెలంగాణలో కొత్తగా తెరపైకి వచ్చిన పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, సదరు వ్యవస్థ చట్టబద్ధం కాదంటూ ఆమధ్య తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వెనువెంటనే సదరు వ్యవస్థ రద్దు కాగా, పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాసగౌడ్, కోవా లక్ష్మి, జలగం వెంకట్రావు, వినయ్ భాస్కర్ లు ఆ పదవులను కోల్పోయారు. అయితే, సదరు వ్యవస్థ ద్వారా లభించిన బుగ్గ కారు దర్పాన్ని వదిలేందుకు మాత్రం వారు ససేమిరా అంటున్నారు. పదవులు పోయి నెల కావస్తున్నా, వారు ఇంకా బుగ్గ కార్లలోనే ప్రయాణిస్తూ డాబూ దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనిపై మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి.