: జగన్ స్టయిల్లో రాహుల్... నేలపై కూర్చుని రైతు కుటుంబానికి పరామర్శ


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర గుర్తుందిగా! తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత గుండె పగిలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు సుదీర్ఘంగా ఓదార్పు యాత్ర చేపట్టిన జగన్, బాధితుల ఇళ్లల్లో నేలపై కూర్చుని, వారు పెట్టిందే తిని, వారితో సుదీర్ఘంగా మాట్లాడి వచ్చేవారు. అచ్చం అలాంటి పరామర్శలే ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నాయి. 'రైతు భరోసా' యాత్ర పేరిట ఆదిలాబాదు జిల్లా కొరిటికల్ గ్రామంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు వెల్మ రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించారు. రాజేశ్వర్ ఇంటిలోపలికి వెళ్లిన రాహుల్, నేలపై కూర్చుని రాజేశ్వర్ భార్య, కుమారుడితో సుదీర్ఘంగా మాట్లాడారు. రాజేశ్వర్ కుమారుడిని ఆప్యాయంగా భుజం తట్టారు. రాజేశ్వర్ ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. అధైర్యపడొద్దని, అండగా నిలుస్తామని వారికి భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News