: తెలంగాణ ‘యాత్ర’కు వచ్చి అస్వస్థతకు గురైన రాహుల్ గాంధీ!


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపర నేపథ్యంలో అన్నదాతలకు భరోసా కల్పించేందుకు ఆదిలాబాదు జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టేందుకు రాహుల్ నిన్న రాత్రి నాందేడ్ మీదుగా నిర్మల్ చేరుకున్నారు. అక్కడి హోటల్ మయూర ఇన్ లో బస చేసిన రాహుల్ గాంధీ వచ్చీ రాగానే అస్వస్థతకు గురయ్యారట. అయితే వైద్యుల ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన వేగంగానే కోలుకున్నట్లు సమాచారం. మరికాసేపట్లో ఆయన రైతు భరోసా యాత్ర ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News