: టీడీపీ నేతలవి గొప్పలే: జోగి రమేష్


ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో 33 వేల ఎకరాలు సేకరించామని, ఇది రికార్డు అని టీడీపీ నేతలు చెప్పినవన్నీ గొప్పలేనని వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానెల్ చర్చలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలు చెప్పినది నిజమే అయితే 33 వేల ఎకరాలకు సంబంధించిన కౌలు చెక్కులు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ చెప్పుకుంటున్నట్టు 33 వేల ఎకరాల రైతులు పట్టాలు ఇచ్చేశారా? అని ఆయన నిలదీశారు. టీడీపీ నేతలు ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుతారని ఆయన విమర్శించారు. నిజానికి 20 వేల ఎకరాలకు సంబంధించిన రైతులు తమ భూములు తీసుకున్నాక తమకు ఎలాంటి పునరావాసం కల్పిస్తారని నిలదీస్తున్నారని ఆయన వెల్లడించారు. వాస్తవాలు కప్పిపుచ్చి టీడీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలోని ప్రతి గ్రామానికి వచ్చేందుకు తాము సిద్ధమని, రైతుల వద్దకు నేరుగా వచ్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారా? అని ఆయన సవాలు విసిరారు. ప్రతిపక్షాలపై లేని పోని ఆరోపణలు చేయకుండా రైతులతో చర్చించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News