: పశ్చిమ కనుమల్లో అరుదైన మొక్క... క్యాన్సర్ కు విరుగుడు అంటున్న శాస్త్రవేత్తలు


శాస్త్రవేత్తల బృందం పశ్చిమ కనుమల్లో ఓ అరుదైన మొక్కను కనుగొన్నది. ఈ మొక్కలో క్యాన్సర్ తో పోరాడే పదార్థాలున్నాయని గుర్తించారు. దీని శాస్త్రీయనామం మిక్వెల్లా డెంటేట్ బెడ్. ఇది గుబురుగా పెరుగుతుంది, పైకి ఎగబాకుతుంది అని పరిశోధకులు వివరించారు. దీంట్లో ఉండే ఆల్కలాయిడ్ పదార్థం కాంప్టోథెసీన్ (సీపీటీ) క్యాన్సర్ తో సమర్థంగా పోరాడుతుందని తెలిపారు. ఇది కర్ణాటకలోని కొడగు ప్రాంతంలోని మడికెరి అడవుల్లో అక్కడక్కడా కనిపిస్తుంది. బెంగళూరు అశోకా ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్ మెంట్, బెంగళూరు అగ్రికల్చరల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ మొక్కను కనుగొన్నారు. ప్రస్తుతం ఈ మొక్కను వాణిజ్యపరంగా భారీ ఎత్తున సాగు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కాఫీ, వక్కల తోటల్లో దీనిని సాగు చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News