: 'నవజీవన్'లో దోపిడీ చేసింది పోలీసులే!


నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో పోలీసులమని బెదిరించి రూ.82 లక్షలు చోరీ చేసిన కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించడం తెలిసిందే. నలుగురు నిందితులను ప్రకాశం జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. కాగా, వారిలో ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు ఉన్నట్టు తెలిసింది. చెన్నైలో బంగారం కొనేందుకు కావలి వ్యాపారులు రైల్లో వెళుతుండగా, వారిని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఘటనపై వ్యాపారులు కావలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో, వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం అలవలపాడు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News