: నాందేడ్ చేరుకున్న రాహుల్... కాసేపట్లో నిర్మల్ పయనం
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు బయల్దేరారు. ఈ సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్ కు విమానంలో చేరుకున్న ఆయన, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పయనమవుతారు. ఈ రాత్రికి నిర్మల్ లో బస చేస్తారు. ఆయన తెలంగాణలో ప్రవేశించేందుకు రోడ్డు మార్గాన్ని ఎంచుకోవడంతో, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, నాందేడ్ లో ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన పాదయాత్ర నిర్వహించనున్నారు.