: అది స్ట్రీట్ ఫైట్ కాదు...ప్రేమ వ్యవహారమూ కాదు: డీసీపీ


నాలుగు రోజుల క్రితం హైదరాబాదులోని పాతబస్తీలో జరిగిన నబీల్ హత్యోదంతంపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఇది స్ట్రీట్ ఫైట్ కాదు, అలాగని దీని వెనుక ప్రేమ వ్యవహారం కూడా లేదని వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నబీల్ హత్యోదంతంలో ఇద్దరు మైనర్లు సహా 9 మందిని అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలిపారు. అలాగే ఈ ఘటనలో పలువురి తల్లిదండ్రులను, ఇతర మిత్రులను కూడా విచారించినట్టు ఆయన చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఒవైైస్ పటేల్ తరచూ సహ యువకుల వద్ద బడాయికి పోయేవాడని, ఆధిపత్యం ప్రదర్శించేవాడని ఆయన చెప్పారు. గల్లీల్లో తీసుకున్న డ్రెస్ లు, షూలు కొనుక్కుని అవి ఇంపోర్టెడ్ వంటూ అబద్దాలు చెప్పేవాడని, అతని బడాయిని నబీల్ బ్యాచ్ ఎద్దేవా చేసేవారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యలోనే వారిద్దరూ ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనేది తేల్చుకునేందుకు స్నేహితుల ప్రోత్సాహంతో స్ట్రీట్ ఫైట్ కు దిగారని ఆయన వెల్లడించారు. ఒవైస్ పటేల్ విచక్షణారహితంగా కొట్టడంతో బ్రెయిన్ కు తీవ్రగాయమైన నబీల్ మృతిచెందాడని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News