: ఏమీ తెలియనివారికి ఏ విషయం అయినా చెప్పొచ్చు: జగన్


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విమర్శల జడివాన కురిపించారు. ఏమీ తెలియనివారికి ఏ విషయం అయినా చెప్పొచ్చని, అన్నీ తెలిసిన వ్యక్తికి ఏం చెబుతామని అన్నారు. అన్నీ తెలిసిన చంద్రబాబు కూడా అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రధాన హామీ అయిన రుణమాఫీ ఎక్కడా చేయలేదని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. రుణాల కోసం బ్యాంకులకు వెళుతున్న రైతులు అవమానకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రుణాలు కోరిన రైతుల పాస్ బుక్కులను బ్యాంకు అధికారులు విసిరి కొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఏపీపై శ్రద్ధ చూపాలని హితవు పలికారు. విదేశాలపై మోజు తగ్గించుకుని రాష్ట్రంపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News