: చీరాలలో సందడి చేసిన 'బాపు గారి బొమ్మ'


టాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'అత్తారింటికి దారేది' చిత్రంలో "...గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ... అమ్మో.... బాపు గారి బొమ్మో..." అంటూ సాగే పాటలో పవన్ కల్యాణ్ ను మెస్మరైజ్ చేసిన భామగా నటి ప్రణీత బాగా పాప్యులరైంది. ఈ బాపు గారి బొమ్మ తాజాగా ప్రకాశం జిల్లా చీరాలలో సందడి చేసింది. చీరాలలో కొత్తగా 'ఆకృతి' పేరిట ఏర్పాటైన షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ కూడా పాల్గొన్నారు. ఈ ముద్దుగుమ్మను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో, షోరూం పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి. షోరూం వెలుపల ఆమె బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక, ప్రారంభోత్సవం అనంతరం షోరూంలోని దుస్తులు, ఇతర వస్తువులను ప్రణీత ఆసక్తిగా పరిశీలించింది.

  • Loading...

More Telugu News