: నేను చిత్రకారుడ్ని కాదు...అది అభిరుచే: గుల్జార్


'ప్లూటో' పేరిట చిన్నచిన్న కవితల పుస్తకాన్ని ప్రముఖ కవి, సినీ గీత రచయిత గుల్జార్ ప్రచురించనున్నారు. ఈ పుస్తకంలోని కవితలకు అవసరమైన చిత్రాలను ఆయనే చిత్రీకరించడం విశేషం. చార్ కోల్ తో గీసిన చిత్రాలను ఆయన ఈ పుస్తకంలో ప్రచురిస్తున్నారు. చిత్రాలు వేసినంత మాత్రాన తాను చిత్రకారుడిని కాదని, చార్ కోల్ తో చిత్రాలు గీయడం తనకు ఇష్టమని ఆయన పేర్కొన్నారు. అది హాబీ అని ఆయన చెప్పారు. చార్ కోల్ తో ఇప్పటికి వందకుపైగా చిత్రాలు గీశానని, వాటిని భద్రంగా దాచుకున్నానని ఆయన వెల్లడించారు. వాటిని భద్రంగా దాచుకున్నానని ఆయన అన్నారు. తన చిత్రాలు ప్రదర్శించేంత గొప్పవ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పబ్లిషర్ కు నచ్చడంతో ప్రచురిస్తానంటే ఒప్పుకున్నానని ఆయన తెలిపారు. ఇంత వరకు కవిగా, గీత రచయితగా అభిమానులను అలరించిన గుల్జార్, చిత్రకారుడిగా ఎంత వరకు అలరిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News