: కృష్ణ జింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ కు చుక్కెదురు
జోధ్ పూర్ కోర్టు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు షాక్ ఇచ్చింది. కృష్ణ జింకను వేటాడిన కేసుకు సంబంధించి సల్మాన్ పెట్టుకున్న పిటిషన్ ను తోసిపుచ్చింది. సాక్షులను మళ్లీ విచారించేందుకు అనుమతించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను కొట్టివేసింది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం జోధ్ పూర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' షూటింగ్ జరుగుతున్న సమయంలో... ఒక కృష్ణ జింకను, మూడు చింకారాలను సల్మాన్ వేటాడినట్టు కేసు నమోదైంది. దీనికి సంబంధించి, సల్లూభాయ్ పై వన్యమృగాల సంరక్షణ చట్టం, ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది. ఇటీవలే హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ కు బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.