: రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పులు
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రూటు మార్చారు. ఆయన తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాదు నుంచి ఆదిలాబాద్ లోని నిర్మల్ వెళ్లాల్సిన రాహుల్ గాంధీ, మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఆదిలాబాద్ జిల్లా వెళ్లనున్నారు. నేటి రాత్రి నిర్మల్ లోని ఓ హోటల్ లో బస చేసే రాహుల్ రేపు రైతులతో సమావేశం కానున్నారు. అయితే, రేపటి కార్యక్రమాల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం గమనార్హం. కాగా, ఆయన హైదరాబాదు రానున్నారన్న సమాచారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సన్నద్ధమయ్యారు. అయితే, ఆయన పర్యటనలో మార్పులతో వారంతా నిరాశ చెందారు.