: రాహుల్ పర్యటన రైతుల కోసం కాదు... కాంగ్రెస్ బలోపేతానికే: నిజామాబాదు ఎంపీ కవిత


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్ర పేరిట తెలంగాణలో రేపు చేపట్టనున్న పాదయాత్రపై కేసీఆర్ కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆత్మహత్యల బాట పడుతున్న రైతుల్లో ధైర్యాన్ని నూరిపోసేందుకే రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారని టీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రైతులను పరామర్శించే రాహుల్, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా చేస్తారని ఆ పార్టీ సీనియర్ నేత వి. హన్మంతరావు ప్రకటించారు. అయితే రాహుల్ గాంధీ పర్యటన ఉద్దేశం రైతుల ఉద్ధరణ కాదని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలోనే రాహుల్ పర్యటిస్తున్నారని ఆమె ఆరోపించారు. 60 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసిందో చెప్పాలని కూడా ఆమె రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. తాము కూడా రాహుల్ పర్యటనను పరిశీలిస్తామన్న ఆమె, రైతు ఆత్మహత్యల నివారణకు రాహుల్ ఏమైనా సలహాలిస్తారేమో చూస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News