: కాబూల్ లో ఉగ్రవాది కాల్పులు...ఇద్దరు ఇండియన్లు, ఏడుగురు విదేశీయులు మృతి
నిన్న పాకిస్థాన్, నేడు ఆప్ఘనిస్థాన్... ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. నిన్న పాకిస్థాన్ నగరం కరాచీలో సామాన్యులు ప్రయాణిస్తున్న బస్సుపై మూకుమ్మడి దాడి చేసిన తాలిబన్ ఉగ్రవాదులు 47 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనను మరువకముందే అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఓ ఉగ్రవాది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఓ భవనంలోకి చొచ్చుకువెళ్లిన సదరు ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు, ఏడుగురు ఇతర దేశాలకు చెందిన వారు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.