: క్రికెట్ వుంటే ఇంట్లో వంట బంద్!
భారతీయులు మంచి భోజన ప్రియులన్నది ప్రపంచం మొత్తానికి తెలిసిన నిజం. అలాగే క్రికెట్ అన్నా పడిచస్తారు. తాజాగా పిజ్జా తింటూ క్రికెట్ చూడడాన్ని ఎక్కువ మంది భారతీయులు ఆస్వాదిస్తున్నారట. గ్రూపాన్ ఇండియా వెబ్ సైట్ 'ఫుడ్ ప్రీమియర్ లీగ్' పేరిట ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు వంట చేయడం కంటే పిజ్జా ఆర్డర్ చేయడానికే ఎక్కువ (48శాతం) మంది మొగ్గుచూపుతున్నారట. బర్గర్, పాస్టా కంటే పిజ్జాకే ఎక్కువ మంది ఓటేశారు. క్రికెట్ మ్యాచ్ ఉంటే 68 శాతం మంది ఫుడ్ ఐటెమ్స్ డిస్కౌంట్స్ కోసం ఆన్ లైన్లో వెతుకుతున్నారట. క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు ఫుడ్, డ్రింక్స్ కోసం 300 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారట. ఈ వివరాలను గ్రూపాన్ ఇండియా వెబ్ సైట్ తెలిపింది.