: హాలీవుడ్ సీరియల్ లో అదరగొట్టిన ప్రియాంక... ఆకట్టుకుంటున్న ట్రైలర్


బాలీవుడ్ లో అద్భుతమైన నటిగా నిరూపించుకున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్ పై కన్నేసింది. ఈ మధ్యే న్యూయార్క్ వెళ్లి 'క్వాంటికో' అనే అమెరికన్ సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ లో ప్రియాంక చోప్రా ఎఫ్ బీఐ ట్రైనింగ్ అధికారిగా నటిస్తోంది. తనతోపాటు ట్రైనింగ్ అవుతున్న వారిలో తీవ్రవాదులు కూడా ఉంటారు. వారిలో ఒకరితో ప్రియాంక చోప్రా ప్రేమలో పడుతుంది. అతను తీవ్రవాది అని తెలుసుకునే సరికి అరెస్టు అయిపోతుంది. దాని నుంచి ఎలా బయటపడిందనేది సీరియల్ కథనం. 'క్వాంటికో' ట్రైలర్ ను సోషల్ మీడియాలో ప్రియాంక విడుదల చేసింది. ఇందులో హాట్ హాట్ సన్నివేశాలు కూడా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కాగా, 'క్వాంటికో' ట్రైలర్ పై బాలీవుడ్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రియాంక నటన అద్భుతంగా ఉందని సహనటులంతా అభినందిస్తుండగా, ఇకపై ప్రియాంక హాలీవుడ్ లో బిజీ అయిపోతుందని పలువురు వ్యాఖ్యానించడం విశేషం.

  • Loading...

More Telugu News