: నేపాల్ లో ఇప్పటివరకు 202 సార్లు భూమి కంపించిందట
7.9 తీవ్రతతో గత నెల 25న నేపాల్ ను అతలాకుతలం చేసిన భూకంపం తరువాత, ఇప్పటికీ అక్కడ ప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ ప్రకంపనల తీవ్రతలో హెచ్చుతగ్గులున్నప్పటికీ భూమి కంపించడం మాత్రం ఆగడం లేదు. కొన్ని సార్లు ఈ తీవ్రత పెరగడంతో భారత్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లోని పలు ప్రాంతాలు వణుకుతూ భయాందోళనలు పెంచుతున్నాయి. ఏప్రిల్ 25న వచ్చిన భూకంపం తరువాత నేటి వరకు నేపాల్ లో 202 సార్లు భూమి ప్రకంపించిందని ఆ దేశానికి చెందిన నేషనల్ సిస్మొలాజికల్ సెంటర్ తెలిపింది. మంగళవారం 7.4 తీవ్రతతో సంభవించిన మరో భూకంపం తరువాత పలు ప్రాంతాల్లో 36 సార్లు భూమి కంపించిందని ఆ సంస్ధ వెల్లడించింది.