: 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమానికి గవర్నర్ ను ఆహ్వానించిన కేసీఆర్


గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి కిందట కలిశారు. ఈ నెల 16న ప్రారంభంకానున్న స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి గవర్నర్ ను సీఎం ఆహ్వానించారు. హైదరాబాద్ ను 'స్లమ్ ఫ్రీ సిటీ'గా చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఈ నెల 20 వరకు స్వచ్ఛ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం పేరుతో రూ.200 కోట్లు దుర్వినియోగం చేస్తున్నారంటూ తెలంగాణ బీజేపీ నేతలు ఈరోజు గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News