: జరిమానాలో 10 శాతం చెల్లించిన సత్యం దోషులు


సత్యం కుంభకోణం కేసులో హైదరాబాద్ లోని సీబీఐ ఆర్థిక నేరాల కోర్టు విధించిన జరిమానాలో 10 శాతాన్ని సత్యం దోషులు చెల్లించారు. అంతేగాక బెయిల్ కింద ప్రత్యేక న్యాయస్థానం విధించిన పూచీకత్తును కూడా డిపాజిట్ చేశారు. దాంతో రామలింగరాజు సహా 9 మంది దోషులను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. రేపు వారంతా విడుదలవుతారని తెలుస్తోంది. సత్యం స్కాంలో అంతకుముందు సీబీఐ కోర్టు రామలింగరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 కోట్ల భారీ జరిమానా, మిగతా వారికి కూడా అదే శిక్ష విధించి, రూ.25 లక్షలు జరిమానా విధించింది. ఇంత జరిమానా తాము చెల్లించలేమని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, అంతేగాక తమ కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ సత్యం దోషులు నాంపల్లి కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో జరిమానాలోని పది శాతాన్ని నెలలోగా చెల్లించాలని రెండు రోజుల కిందట బెయిల్ ఇచ్చిన సమయంలో న్యాయస్థానం ఆదేశించింది.

  • Loading...

More Telugu News