: పట్టపగలు దారుణం...వెంటాడి వేటాడాడు


మధ్యప్రదేశ్ లోని బీండ్ లో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. సంజీవ్, దోవా అనే రౌడీ షీటర్ల మధ్య మద్యం తాగిన సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో సంజీవ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో, ఇది గ్యాంగ్ వార్ గా మారింది. ఈ క్రమంలో దోవా వర్గీయులు, సంజీవ్ వర్గీయులు పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం బీండ్ లోని ఓ ఆసుపత్రి వద్దకు ఓ వర్గంలోని వ్యక్తిని మరో వర్గంలోని వ్యక్తి తుపాకీ చేతబట్టి తరుముకుంటూ వచ్చాడు. దీంతో ప్రాణభీతితో ఆసుపత్రిలోకి పారిపోయి దాక్కుందామని చూసిన వ్యక్తిని, వెంటాడిన వ్యక్తి వేటాడేశాడు. తన తుపాకీ దెబ్బతిన్న వ్యక్తి మరణించాడో లేదోనన్న అనుమానంతో రెండో సారి కాల్చి చంపేశాడు. ఈ దృశ్యాలు ఆసుపత్రిలో సీసీ టీవీ పుటేజ్ లో రికార్డు అయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో ఆసుపత్రికి వచ్చిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News