: 12 మందిపై హత్యాచారం చేసి, రక్తం తాగిన రాక్షసుడు


నాగరిక సమాజంలో మూఢనమ్మకాలు ప్రబలుతున్నాయి. సాంకేతికంగా ఎంత దూసుకుపోతున్నామో, అంతే స్థాయిలో మూర్ఖశిఖామణులు కూడా తయారవుతున్నారు. బలవంతుడిగా మారేందుకు ఓ మూర్ఖుడు 12 మంది మహిలళపై అత్యాచారానికి పాల్పడి, వారిని హత్య చేసి, వారి రక్తం తాగిన ఘటన జింబాబ్వేలో వెలుగు చూసింది. అలోన్ నదునా (26) అనే వ్యక్తి గత వారం 12 మంది మహిళలను పొట్టన బెట్టుకున్నదే కాకుండా, వారి రక్తం తాగేవాడట. ఎట్టకేలకు అతడిని జింబాబ్వే పోలీసులు అరెస్టు చేశారు. చేసిన నేరాల నుంచి తప్పించుకునేందుకు అనేక మారు పేర్లతో తిరిగే వాడని పోలీసులు తెలిపారు. ఇంతకీ అత్యాచారం చేసి ఎందుకు చంపావు? అని అడిగితే, మహిళలపై అత్యాచారం చేసి, చంపి, వారి రక్తం తాగితే బలవంతుడిగా మారుతారని తమ ప్రార్థనాలయంలో చెప్పారని, బలవంతుడిగా మారేందుకు తాను ఆ నేరాలకు పాల్పడ్డానని నదునా చెప్పడం విశేషం.

  • Loading...

More Telugu News