: బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ద్వారక పీఠాధిపతి... అయోధ్యలో రామ మందిరాన్ని తామే నిర్మిస్తామని ప్రకటన


కేంద్రంలో కొలువుదీరిన బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేపై ద్వారక పీఠాధిపతి సద్గురు స్వరూపానంద సరస్వతి శంకరాచార్య విరుచుకుపడ్డారు. రాజ్యసభలో మెజారిటీ లేకుండా, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టం తీసుకురావడం అసాధ్యమని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో, శంకరాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిరాన్ని నిర్మించడం చేతగాని బీజేపీ నేతలు ఇకపై మందిర నిర్మాణం గురించి మాట్లాడటం ఆపాలని సూచించారు. సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పునిస్తే... మందిరాన్ని తామే నిర్మిస్తామని తేల్చి చెప్పారు. హిందూ ధర్మ సంసద్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, శంకరాచార్య పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News